సెప్టెంబర్ 4, 2026
TRINETHRAM NEWS
SI Constable Friendship Ganja Gang

గంజాయి బ్యాచ్ ఇంటిపై రైడ్ చేసిన ఈగల్ టీం పోలీసులపై కుక్కలను వదిలి, స్క్రూడ్రైవర్‌తో దాడి

SI Constable Friendship Ganja Gang : త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్ – బాలానగర్‌లోని వినాయక్‌నగర్ శ్మశానవాటిక సమీపంలో ఓ ఇంట్లో ఉంటూ 2022 నుంచి గంజాయి సప్లై చేస్తున్న ఏపీ – పాడేరుకు చెందిన దుర్గాప్రసాద్, కమలాకర్, కిరణ్ అనే ముగ్గురు అన్నదమ్ములు… ఏపీ-ఒడిశా సరిహద్దుల నుంచి గంజాయి తెచ్చి చిన్న చిన్న పొట్లాలుగా మార్చి వాట్సాప్ ద్వారా విక్రయం

బుధవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో అన్నదమ్ములు వారి ఇంటికి వచ్చినట్లు గుర్తించి చుట్టుముట్టిన ఈగల్ టీం పోలీసులు… దీంతో పోలీసుల మీదకు కుక్కను ఉసిగొల్పి, స్క్రూడ్రైవర్‌తో పొడిచి దాడి చేసిన అన్నదమ్ములు

ఈ నిందితులను పట్టుకొని విచారించగా వీరితో బాలానగర్ పీఎస్‌కు చెందిన పోలీసులు కూడా చెట్టాపట్టాలు వేసుకొని తిరిగినట్లు గుర్తింపు… ఈగల్ టీం దాడి చేసే కంటే కొన్ని గంటల ముందే నిందితుల ఇంటికి పోలీసులు వచ్చి పార్టీ చేసుకున్నట్లు, మంగళవారం జరిగిన పార్టీలో ఎస్సై, కానిస్టేబుల్ పాల్గొన్నట్లు గుర్తింపు

సదరు ఎస్సై రెండు రోజుల క్రితమే బాలానగర్ పీఎస్ నుంచి బదిలీ…. ఎస్సై, కానిస్టేబుళ్ల ప్రైవేట్ పార్టీలకు మద్యం, క్యాటరింగ్ సరఫరా చేసే నిందితులు… దీంతో నిందితులతో కుమ్మక్కై తనిఖీలకు ఎవరొచ్చినా ముందే సమాచారం ఇచ్చే పోలీసులు… అలాగే నిందితుల ఫోన్లు చెక్ చేసి 203 మంది గంజాయి కొన్నట్లు గుర్తించి.. అందులో వంద మందిని పరీక్షించగా, 72 మందికి పాజిటివ్…..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page