పోలవరం జిల్లా : జనవరి 03: (త్రినేత్రం న్యూస్); ఈ నియోజకవర్గం, కుక్కునూరు మండలంలో ఎస్సై రాజారెడ్డి ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తెలిపారు సిఐటియు ఆధ్వర్యంలో మండల పోలీసు స్టేషన్ లో ఆటో డ్రైవర్లు సమస్యలను ఆయనకు ఆటో యూనియన్ నాయకులు వివరించారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్స్, వాహన బీమా, పర్మిట్ వంటి పత్రాలు సక్రమంగా కలిగి ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా వేగ నియంత్రణ పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనం నడపకూడదని, హెల్మెట్ మరియు ట్రాఫిక్ సిగ్నల్స్‌ను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.
ప్రయాణికుల భద్రతే ప్రధాన లక్ష్యంగా డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలని, చట్టాలను గౌరవిస్తూ వృత్తి నిర్వహించాలని సూచించారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజల భద్రత కోసమే పనిచేస్తుందని, డ్రైవర్లు పోలీస్ శాఖతో సహకరించాలని కోరారు.
సిఐటియు జిల్లా కార్యదర్శి యర్నం సాయికిరణ్ మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా ఆటో డ్రైవర్లకు పికపింగ్,డ్రాపింగ్ స్థలం లేకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని, రవాణా కార్మికుల మధ్య సమన్వయం ఎల్లప్పుడూ ఉండాలని, రోజు వారు ఏదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని సాయికిరణ్ కోరడం జరిగింది.
ఈ సమావేశంలో ఆటో యూనియన్ అధ్యక్షులు పోచారపు వెంకటేశ్వర్లు,కార్యదర్శి ఘంటసాల రమేష్,ఉపాధ్యక్షులు దార కృష్ణ, ఆటో డ్రైవర్లు శనగ రాము,వేల్పుల దుర్గయ్య,మంగరాజు, వినోద్, ఆదినారాయణ, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


