Road Accidents : నిర్లక్ష్యం గా, అజాగ్రత్త గా వాహనాలు నడపడం వల్లనే అధిక రోడ్డు ప్రమాదాలు

TRINETHRAM NEWS

నిర్లక్ష్యం గా, అజాగ్రత్త గా వాహనాలు నడపడం వల్లనే అధిక రోడ్డు ప్రమాదాలు

రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ నిబంధనల ప్రతి ఒక్కరూ పాటించాలి : ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రోడ్ భద్రత మాషోత్సవాల సందర్బంగా పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణ కేంద్రం లోని ఐటిఐ కళాశాల ఆవరణలో ఆటో డ్రైవర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం ఐటిఐ కళాశాల, బస్ స్టాండ్, కమాన్ చౌరస్తా నుండి, కలెక్టరేట్ అక్కడ నుండి ఆర్టీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ఈసందర్బంగా సీఐ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు బాధ్యతాయుతంగా వాహనాలు నడుపుతూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు. ఖాకీ చొక్కా విధిగా ధరించడంతో పాటు లైసెన్స్ కలిగి ఉండాలని, వాహనానికి ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనల పట్ల, సైనేజ్ ల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ముఖ్యంగా పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని ప్రమాదాలకు కారణం కావద్దని డ్రైవర్లకు సూచించారు. ఆటో డ్రైవర్లు ప్రయాణికులతో సత్ప్రవర్తనతో మెలుగాలని, ప్రమాదాల నివారణకు సహకరిస్తూ ప్రమాదరహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలని సీఐ కోరారు. ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండాలని, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపవద్దని సూచించారు.

ప్రయాణికులను ఆటోలో ఎక్కించుకునే సమయంలో, దింపే సమయంలో రోడ్డు పక్కన ఆపాలని, తద్వారా ప్రయాణికుల భద్రత లక్ష్యంగా మన్ననలు పొందాలని సూచించారు. ఎక్కడ పడితే అక్కడ ఆటోలు నిలపకుండా ఆటో స్టాండ్ లలో మాత్రమే నిలపాలని కోరారు. వాహనం నడిపే సమయంలో డ్రైవింగ్ పై శ్రద్ద వహించాలని, అలా కాకుండా భారీ శబ్దాలతో కూడిన మైక్ సెట్లను అమర్చి ప్రయాణికులకు అసౌకర్యం కల్పించవద్దని కోరారు.

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సామజిక బాధ్యత గా క్షతగాత్రులను దగ్గర లో ఉన్న ఆస్పత్రికి తరిలిస్తే వారిని బతికించుకోవచ్చు అన్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, జిల్లా రవాణా అధికారి రంగా రావు, అంవి మధు మరియు సిబ్బంది, ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు బొంకూరి నర్సయ్య, తహేర్, అజ్గర్, రెడ్డి మరియు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top