ఆగస్ట్ 24, 2026
TRINETHRAM NEWS
Shekhar Reddy Sapling Distribution

ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి .. తీదేడు గ్రామ సర్పంచ్

Shekhar Reddy : చింత పల్లి ఆగష్టు 01, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలం తీదేడు పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామంలో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు వివిధ రకాల మొక్కలను పంపిణీ చేశారు.అనంతరం హారితహారం లో భాగం పల్లె ధావఖాన వద్ద మొక్కలు నాటారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని,పచ్చదనం పెంపొందించేందుకు గ్రామ ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మొక్కల పెంపకంతో పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇడబోయిన వెంకటయ్య యాదవ్, వార్డు సభ్యులు బొడ్డు పార్వతమ్మ యాదగిరి, మాదగోని కృష్ణ గౌడ్,దాసరి కళమ్మ ముత్తయ్య, రెడ్డి పద్మ పరమేష్,మర్ల యాదగిరి,గ్రామ ప్రజలు,అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు,గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page