అక్టోబర్ 24, 2026
TRINETHRAM NEWS
Badminton Tournament

– హోరాహోరీ పోరులో చందు నరహరి కైవసం చేసుకున్న విజేత ట్రోఫీ

Badminton Tournament : కూకట్పల్లి సెప్టెంబర్ 12 త్రినేత్రం న్యూస్ : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదర్‌నగర్ డివిజన్‌లోని ఎస్ఎల్‌వి ప్రో బ్యాడ్మింటన్ అకాడమీలో శనివారం బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించారు. స్థానిక క్రీడాకారులు, అకాడమీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలు విభాగాల్లో జరిగిన ఈ పోటీలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగాయి. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్ ప్రేక్షకులను తీవ్రంగా ఆకట్టుకుంది. ఆఖరి పాయింట్ వరకు నువ్వా-నేనా అన్నట్లుగా సాగిన హోరాహోరీ పోరులో చందు నరహరి అద్భుతమైన ప్రతిభను కనబరిచి విజేతగా నిలిచారు. విజేతగా నిలిచిన చందు నరహరికి నిర్వాహకులు ప్రథమ బహుమతితో పాటు జ్ఞాపికను అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా, వ్యక్తుల మధ్య స్నేహభావాన్ని, ఐక్యతను పెంపొందించడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. పండుగల వేళ ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా సమాజంలో సోదరభావం పెరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో క్రీడా ప్రోత్సాహకులు విష్ణు యాదవ్, డాక్టర్ సురేందర్, అజయ్ చింతల, రామ్, నవీన్, ప్రవీణ్, ఆర్కే, సుధాకర్, సాయి, నరేష్, రమేష్, నాగరాజు యాదవ్, సురేంద్ర, దరియా, కిషోర్, బ్రహ్మ రెడ్డి తదితరులు పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page