
PM Modi : త్రినేత్రం న్యూస్ : Aug 01, 2026, ప్రధాని నరేంద్ర మోదీ అర్థరాత్రి మరో వీడియో విడుదల చేసి యువతకు కీలక సందేశం ఇచ్చారు. దూషణలు ఎలాంటి సమస్యకూ పరిష్కారం కాదని, దేశ అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. జంతర్‌మంతర్ వద్ద జరిగిన పరిణామాలను దేశమంతా చూసిందని, ఆందోళనల్లో కొందరు యువత అసభ్యకరంగా మాట్లాడారని పేర్కొన్నారు.
తనతో పాటు తన తల్లిని కూడా దూషించినప్పటికీ, పిల్లల పొరపాట్లు సహజమని భావించి క్షమిస్తున్నానని తెలిపారు. యువతను శిక్షించడం లేదా వేధించడం కంటే సరైన మార్గంలో నడిపించడమే సమాజ బాధ్యత అని అన్నారు. గత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని దేశ పురోగతి కోసం యువత ఐక్యంగా ముందుకు సాగాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe