జూలై 7, 2026
TRINETHRAM NEWS
MPDO Take care of sanitation

MPDO : గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఇంచార్జి. త్రినేత్రం న్యూస్. పెనుమూరు (మే 22). మండలంలోని ఆయా గ్రామాల్లోని ప్రజలు పారిశుధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎంపీడీవో నీలకంఠేశ్వర్ రెడ్డి కోరారు. శుక్రవారం మండలంలోని ఉగ్రానంపల్లెలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ప్రజలు చెత్తను ఎక్కడంటే అక్కడ వేయరాదని,ఇంటి వద్దనే పొడి చెత్తను, తడి చెత్తను వేరుచేసి ఉంచాలన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది చెత్తను సేకరించి ఆయా గ్రామాల పరిధిలోని చెత్త కేంద్రాలకు తరలించడం జరుగుతుందన్నారు.

చాలా గ్రామాల్లో చెత్తను ఇళ్ళ ముందర,గ్రామ పరిసరాల్లో ఎక్కడంటే అక్కడ వేస్తున్నారని అలాంటి వారిపై ఇక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గ్రామ కార్యదర్శులు ఎప్పటికప్పుడు గ్రామాలను సందర్శించి పారిశుధ్యoపై ప్రజలకు అవగాహన కల్పించి గ్రామాలను,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేటట్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం పారిశుద్ధ సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page