
ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి :– బుడిగ వెంకటేష్ .
SFI : దేవరకొండ డివిజన్ జూన్ 23, త్రినేత్రం న్యూస్. దేవరకొండ లో జూన్ 23 నుంచి 28 వరకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాస్టల్స్, స్కూలు సర్వేలో భాగంగా దేవరకొండ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ఎస్టీ ఏ 1 హాస్టల్,డిఎన్టి హాస్టల్లో సర్వే నిర్వహించి అక్కడవున్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది.
అనంతరం ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడారు…. విద్యారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తుందని నూతన అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన కూడా గత సమస్యలతోటే విద్యార్థులకు స్వాగతం పలుకుతూ హంగు ఆర్భాటాలు చేస్తుంది తప్ప పూర్తి స్థాయిలో విద్యార్థులకు న్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.డిఎన్టి హాస్టల్లో ప్రధానమైన సమస్య త్రాగునీరు సమస్య పరిష్కరించకుండా మళ్లీ హాస్టల్ పునర్ ప్రారంభించి నీటి సమస్యతోటి ఇబ్బంది పడుతూ విద్యార్థులు హాస్టల్ వైపు చూడాలంటే మొఖం చాటేస్తున్న పరిస్థితి వున్నా కూడా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం సరైంది కాదని అన్నారు.
అదేవిధంగా మరుగుదొడ్లు శిధిలావస్థకు చేరుకున్నాయని అన్నారు గతంలో అధికారులకు చెప్పినప్పటికీ కూడా పట్టించుకునే పరిస్థితి కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే డిఎన్టి హాస్టల్ ప్రహరీ గోడ మంచినీటి సౌకర్యం కల్పించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఏ.త్రిశాంత్,ఆర్.అశోక్, ఎన్.అరవింద్,ఎన్.అఖిల్,వి. గణేష్,జైరాం తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe