జూలై 13, 2026
TRINETHRAM NEWS
Seed Fairs Begin Today

Seed Fairs : త్రినేత్రం న్యూస్ : Jun 23, 2026, తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌పై ఎల్‌నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో, రైతులకు ప్రత్యామ్నాయ విత్తనాలను అందించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 2,601 రైతు వేదికల్లో నేటి నుంచి ఈ నెల 30 వరకు విత్తన మేళాలు నిర్వహించబడతాయి.

ఈ మేళాలలో తక్కువ నీటితో సాగు చేయగల పెసర, మినుము, కంది, నువ్వులు, వేరుశనగ, కూరగాయలు, కొన్ని రకాల సన్న వరి విత్తనాలు అందుబాటులో ఉంచుతారు. అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పిస్తారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page