ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
minister extended his greetings

Minister : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్; జూన్ 23; ఒలింపిక్ విలువలు యువతకు స్ఫూర్తి అని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అంతర్జాతీయ ఒలంపిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ ఒలింపిక్ విలువలైన ఉత్తమత , స్నేహం, గౌరవం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో క్రీడా రంగం అభివృద్ధి చెందుతోందని, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు సారధ్యంలో యువత క్రీడలను జీవనోపథిగా స్వీకరించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని ఆయన అన్నారు.. క్రీడల ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, యువత క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page