*టి.జి.ఈ. డబ్ల్యూ.ఐ.డి.సి పనుల పై సమీక్షించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి, మే -07// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ పాఠశాలలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో టి.జి.ఈ. డబ్ల్యూ.ఐ.డి.సి అభివృద్ధి పనుల పై సమీక్ష నిర్వహించారు టి.జి.ఈ. డబ్ల్యూ.ఐ.డి.సి ద్వారా పాఠశాలలో చేపడుతున్న అభివృద్ధి పనులు, యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణ పనుల పురోగతి వివరాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ కు వివరించారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ జిల్లాలో మాడల్ స్కూల్స్, గురుకులాలు, జడ్పి ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలో టి.జి.ఈ. డబ్ల్యూ.ఐ.డి.సి ద్వారా చేపట్టిన అదనపు తరగతులు, సైన్స్ ల్యాబ్ నిర్మాణం, కాంపౌండ్ వాల్ వివిధ అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు
జిల్లాలో ప్రభుత్వం మంజూరు చేసిన యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణ పనులు ప్రారంభించాలని , నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయాలని అన్నారు. రామగుండం ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిన్నోవేషన్ పనులు పూర్తి చేయాలని అన్నారు. శాతవాహన విశ్వవిద్యాలయం క్రింద గోదావరిఖని పీజీ కళాశాలలో చేపట్టిన అభివృద్ధి పనులకు టెండర్ ఒప్పందం పూర్తి చేసుకుని మే 20 నాటికి పనులు ప్రారంభించాలని అన్నారు
జిల్లాలో చేపట్టిన చిల్డ్రన్ హోమ్ నిర్మాణంలో పురోగతి సరిగ్గా లేకపోవడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్దేశిత సమయంలో పనులు పూర్తయ్యేలా ప్రత్యేకంగా పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు కోటి పది లక్షల రూపాయలతో చేపట్టే ఐటిఐ ఇన్నోవేషన్ పనుల టెండర్లు పూర్తి చేసి 5 నెలల వ్యవధిలో పూర్తి చేయాలని అన్నారు
ఈ సమావేశంలో ఈఈ టి.జి.ఈ. డబ్ల్యూ.ఐ.డి.సి అనితా శింగనాథ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


