జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 30 at 16.01.04

TRINETHRAM NEWS

నూతన కార్యాలయం వద్ద అవసరమైన వసతులు ఏర్పాటు చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి, జనవరి-30: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, నూతన ఎంపిడిఓ కార్యాలయం వద్ద అవసరమైన వసతులు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి రైల్వే స్టేషన్ రోడ్ సమీపం లోని భవనంలోకి నూతనంగా తరలించిన ఎంపీడీవో కార్యాలయాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, పెద్దపల్లి ఆర్టిసి బస్సు డిపో కు ఎంపీడీవో కార్యాలయ భూమి ని అప్పగించినందున, ఎంపిడిఓ కార్యాలయాన్ని రైల్వే స్టేషన్ రోడ్డు లోని నూతన భవనంలోకి మార్చడం జరిగిందని అన్నారు. నూతన కార్యాలయం ముందు ఉన్న ఓపెన్ ప్లెస్ ను కూడా వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు.

నూతన కార్యాలయం వద్ద అవసరమైన వసతులు కల్పనకు ప్రతిపాదనలు అందించాలని కలెక్టర్ అధికారులకు పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎంపిడిఓ కార్యాలయం పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జడ్పి సీఈఓ నరేందర్,ఎంపీడీవో శ్రీనివాస్ , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page