AITUC : హైదరాబాదులో ఇందిరా పార్క్ లో మహా ధర్నా కార్యక్రమానికి ఉద్యోగులందరూ వెళ్తున్నారని వినతి పత్రం

TRINETHRAM NEWS

ఇచ్చిన హనుమకొండ జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షులు వేల్పుల సారంగపాణి

హనుమకొండ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. కలెక్టరేట్లో హనుమకొండ జిల్లా డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్.అల్లం.అప్పయ్య కి వినతిపత్రం ఇచ్చిన ఏఐటియుసి హనుమకొండ జిల్లా అధ్యక్షులు వేల్పుల సారంగపాణి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా హాజరై మాట్లాడుతూ మే 20 న ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్ వద్ద ఏఐటియూసి ఆధ్వర్యంలో ఉద్యోగుల హక్కుల సాధనకై నిర్వహించే ఇందిరా పార్క్ మహా ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎన్ హెచ్ ఎం ఉద్యోగులకు పిలుపునిచ్చారు.ఎన్. హెచ్ ఎంలో 78 క్యాడర్స్ లో పని చేస్తున్న 17541 ఉద్యోగులను ఉద్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ కార్డు, హెల్త్ ఇన్సూరెన్స్, ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 61 సంవత్సరం దాటిన వాళ్ళందరికీ నెలకు 25000 పెన్షన్ ఇచ్చి రిటర్మెంట్ బెనిఫిట్స్ 10 లక్షలు వర్తింపచేయాలి. ఎన్ హెచ్ ఎం ఆల్ క్యాడర్స్ ఉద్యోగుల సమస్యల శాశ్వత పరిష్కారం కొరకై ఒక్కరోజు మహాధర్నా హైదరాబాద్ ఇందరా పార్క్ ఉద్యోగులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు బత్తుల విష్ణుమూర్తి ఏఐటియుసి హనుమకొండ జిల్లా సమితి సభ్యులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Petition stating that all

You cannot copy content of this page

Scroll to Top