Sarpanch Stalin : రైతుల నడ్డి విరుస్తున్న విద్యుత్ శాఖ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కడియం మండలం, జేగురుపాడు గ్రామం, రైతే రాజు అని వ్యవసాయం పండగ చేస్తాము అని రక రకాల ఆచరణ కానీ హామీలుయిస్తూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న వైనం తెలుసు, రైతులకు అనుబంధంగా పాడిపరిశ్రమను అభివృద్ధి చేయుటకు గోకులాలు పశువులకు షెడ్స్ నిర్మించుకొనుటకు కేద్రప్రభుత్వం. ఇటీవల ఎన్.అర్. ఈ. జి.సి పథకం ద్వారా తొంబై శాతం సబ్సిడీతో రైతులకు గోకుల షెడ్స్ ఇచ్చి పాడి పరిశ్రమను ప్రొచ్చహిస్తుంటే రాష్ట్ర విద్యుత్ శాఖ, గోకుల షెడ్స్ కు రైతులు విద్యుత్ కనక్షన్స్ కోసం దరఖాస్థు చేసుకుంటే సుమారు ఆరువేలు వరకు డిపాజిట్ రూపేణా వసూలుచెయ్యడమే కాకుండా కేటగిరి 2 క్రింద యూనిట్ చార్జెస్ వసూలు చేస్తున్నారు,

ఇళ్లకు వాడే కరెంటు కేటగిరి 1 లో యూనిట్ చార్జెస్ వసూలు చేస్తూ రైతులు సొంతంగా వేసుకున్న పశువుల పాకలను కూడా వదలకుండా ప్రభుత్వం ఇచ్చే గోశాలలతోపాటు కేటగిరి 2 లో కమర్శియల్ గా పరిగనిస్తూ అధిక మొత్తంలో డబ్బులు కట్టించుకోవడం దారుణం అని గతంలో రైతుల పశువుల పాకలకు 125 రూపాయలు డిపాజిట్ కట్టితే విద్యుత్ సర్వీసులు ఇచ్చేవారని అంతంత మాత్రంగా వ్యవసాయం చేస్తూ నష్టాలతో ఇబ్బందులు పడుతూ వున్న గ్రామీణ రైతులు కొంతమంది వేడినీళ్లకు చన్నీళ్లు సాయంగా పాడి పశువులను పెంచుకుంటూ తద్వారా కొంత జీవనోపాదిని మెరుగు పరుచు కోవాలని ఆశపడుతున్న రైతులను విద్యుత్ శాఖ అధిక మొత్తంలో తలకుమించిన భారంగా రైతుల నుండి పాడి సంపదను దూరం చేస్తున్నారని దీనిపై ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక శాసనసభ్యులు జిల్లా మంత్రివర్యులు ప్రభుత్వం దృష్టికి తీసుకోని వెళ్లాలని రైతుల పశువుల పాకలకు గోకులాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని జేగురుపాడు గ్రామ సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్ ఒక ప్రకటనలో అధికారులను కోరారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

breaking the hearts of farmers

You cannot copy content of this page

Scroll to Top