Girajala Babu : ఆర్టీసీ అధికారులు వెంటనే విద్యార్థులు వెతలు తీర్చాలి

TRINETHRAM NEWS

ఆర్టీసీ డిఎం దృష్టికి విద్యార్థుల సమస్య: వైసిపి రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు
త్రినేత్రం న్యూస్.. కడియం లో వేళకి, రిక్వెస్ట్ బస్ స్టాప్ లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో విద్యార్థులు అనేక ఇక్కట్లు గురవుతున్నారని, బస్సులు వెనక పరుగులు తీసి ప్రమాదాలు పాలవుతున్నారని వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి, కొవ్వూరు, నిడదవోలు నియోజవర్గాల పరిశీలకులు గిరజాల బాబు ఆవేదన వ్యక్తం చేశారు. పత్రిక ముఖంగా శుక్రవారం సమస్యను రాజమండ్రి డిఎం కు విన్నవించారు. మండల కేంద్రమైన కడియం నుంచి రోజూ వందలాదిమంది విద్యార్థులు కళాశాలలకు రాజమండ్రి ఇతర ప్రాంతాలకు వెళతారన్నారు. వీరిలో విద్యార్థినిలు కూడా ఎక్కువగానే ఉంటారని చెప్పారు.
వీరంతా కడియం దేవి సెంటర్ నుంచి బస్సు ఎక్కి తమ విద్యాలయాలకు వెళుతూ ఉంటారని ఇటీవల కాలంలో చాలా బస్సులు ఆపకుండా వెళుతున్నాయని దీంతో విద్యార్థులు సకాలంలో కాలేజీలకు వెళ్లపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఒక్కోసారి స్టాప్ పాయింట్ కు దూరంగా నిలుపుతున్నారని దీనివల్ల విద్యార్థులు పరుగులు తీసి బస్సు అందుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. విద్యార్థినిలు కూడా బస్సులు వెనకాల పరుగులు తీయాల్సిన పరిస్థితి అన్నారు. ఇలాంటి సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు
ఈ పరిస్థితితో ఆందోళనకు గురవుతున్నారు. విద్యార్థులు విద్యాలయాలకు వెళ్ళే సమయాలు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు కడియం దేవి సెంటర్ పాయింట్లో గతంలోగా బస్సు నిలిపి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చేయాలని ఆయన రాజమండ్రి డిఎం ని కోరారు. అవసరమైతే ఈ సమయంలో బస్సులు లేదా ట్రిప్పుల సంఖ్య పెంచాలని, లేదా ప్రత్యేక బస్సులు విద్యార్థుల కోసం నడపాలని ఆయన కోరారు. ఈ విషయంపై డిపో మేనేజర్ ని నేరుగా కలిసి విన్నవిస్తామన్నారు. దొడ్డా బుజ్జి, కడియం గణేష్, పున్నమి రాజు వీర్రాజు,గట్టి నాని బొమ్మిరెడ్డి సత్తిబాబు,ముమ్మిడి ప్రసాదు తదితరులు శుక్రవారం కడియం దేవి సెంటర్లో విద్యార్థులతో కలిసి పరిస్థితిని స్వయంగా సమీక్షించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

RTC officials should immediately resolve the students' problems

You cannot copy content of this page

Scroll to Top