ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్, డిండి బస్టాండ్ ఆవరణలో డ్రైనేజీ లీకై మెయిన్ రోడ్ వైపు ప్రవహిస్తూ దుర్గంధం వెదజల్లుతున్న పట్టించుకోని ఆర్టీసీ సిబ్బంది అధికారులు. ఇంతకు ఆర్టీసీ అధికారులు ఉన్నట్లా లేనట్లు అనీ ప్రయాణికులు ప్రజలు వాపోతున్నారు.
ఈ సమస్య గురించి అచ్చం పేట డిపో మేనేజర్ కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని, నేను వచ్చి బస్టాండ్ ఆవారా లోని సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి రేపు మాకు అంటూ కాలం వెళ్ళదీస్తున్నాడని, బస్టాండ్ మొత్తం చెత్త పేరు కొనిపోయి గుంతల మయంగా రోడ్డు, వచ్చి పోయే ప్రయాణికులకు చాలా ఇబ్బంది ఉన్నా పట్టించుకోవడంలేదని దిండి మండలం ప్రజలు ప్రయాణికులు అనుకుంటున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే డ్రైనేజీ రోడ్డు బస్టాండ్ లో పేర్కొన్న చెత్తను తొలగించి, రోడ్డును సి సి వేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రయాణికులు డిండి మండలం ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

RTC Chee Chee

You cannot copy content of this page