Funds For Panchayat : పంచాయతీలకు రూ.387 కోట్లు విడుదల
Trinethram News : Telangana : తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 15వ ఆర్థిక సంఘం నిధుల్లో భాగంగా 3వ విడతగా రూ. 387.53 కోట్లు విడుదల కావడంతో గ్రామీణ సంస్థలకు భారీ ఊరట లభించింది.
ఇటీవల పంచాయతీ ఎన్నికలు ముగియడంతో పెండింగ్ గ్రాంట్ల విడుదలకు లైన్ క్లియర్ కాగా, ఇప్పటివరకు మూడు విడతల్లో కలిపి మొత్తం రూ.1,034.42 కోట్లు రాష్ట్రానికి జమయ్యాయి. ఈ నిధులను ప్రధానంగా పారిశుద్ధ్యం, తాగునీరు, మౌలిక వసతుల కల్పన వంటి అత్యవసర పనులకు వినియోగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

