Self-Employment Opportunities : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనా రిటీల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. ఉపాధి కల్పన లక్ష్యంగా తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ టీజీఎంఫ్సీ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయ పథకం ఎకనామిక్ సపోర్ట్ స్కీం క్రింద పథకము 2025–26 ఆర్థిక సంవత్సరానికి అమలులోకి తీసుకువచ్చినట్లు జిల్లా మైనారిటీస్ సంక్షేమ అధికారి, వికారాబాద్ ఎస్. రాజేశ్వరి తెలిపారు.1 మైనారిటీ యువతకు ఈ-స్కూటర్ల పంపిణీ పైలట్ ప్రాజెక్ట్ మైనారిటీ యువత పురుషులుఆర్థికంగా బలోపేతం కావడానికి, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ-స్కూటర్ల పంపిణీ పథకం అమలులో ఉంది.

ఈ పథకంలో ఈ-స్కూటర్ యూనిట్ వ్యయం సుమారు రూ.1.50 లక్షలు కాగా, అందులో ఏనాబై శాతం సబ్సిడీ రూ.1.20 లక్షలు ప్రభుత్వం అందిస్తుంది. మిగిలిన ఇరవై/ రూ.ముప్పై వేయులు లబ్ధిదారుడి వాటాగా ఉంటుంది. ఎంపికైన లబ్ధిదారులను ఉబర్ రాపిడో ఓలా వంటి సేవా సంస్థలతో అనుసంధానం చేయడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి.
ఆన్‌లైన్ దరఖాస్తుల వివరాలు … ఈ పథకం కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు తేది: ఇరవై రెండవ నెల రెండూవేల ఇరవై ఆరు ఉదయం పది గంటల ముప్పై నిముషాలు నుండి తేది: ఒకటి మూడవ నెల రెండవె ల ఇరవై ఆరు రాత్రి పదకొండు గంటల యాబై తోమ్మిది వరకు… తూగోబీమ్స్ వెబ్‌సైట్ : టసోబమ్మ్స్ .సీగ్ గవర్నమెంట్ .ఇన్ లో స్వీకరించబడతాయి.
ఈ-స్కూటర్లకు ముస్లిం కమ్యూనిటీ సర్టిఫికేట్ మైనారిటీ కమ్యూనిటీ సర్టిఫికేట్, ఆహార భద్రత కార్డు రేషన్ కార్డులను చిరునామా ఆధారంగా తప్పనిసరిగా సమర్పించాలి. దరఖాస్తుదారుని వయస్సు ఇరవై ఒక సంవత్సరాల నుండి నలబై సంవత్సరాల మధ్యలో ఉండాలి. దరఖాస్తుదారు కనీస విద్యార్హతగా పదవ తరగతి ఉత్తీర్ణుడై ఉండాలి, దరఖాస్తుదారుని డ్రైవింగ్ లైసెన్సు జీరో కేసెస్ , పాన్ కార్డు మరియు గత ఐదు సంవత్సరాలలో తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఎలాంటి ఆర్థిక సహాయం పొందకుండా ఉండాలి
ఈ అవకాశాన్ని వికారాబాద్ జిల్లాలోని అర్హులైన ముస్లిం మైనారిటీ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మైనారిటీస్ సంక్షేమ అధికారిణి ఎస్. రాజేశ్వరి విజ్ఞప్తి చేయడం జరిగినది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Telangana State Government Economic Development

You cannot copy content of this page

Scroll to Top