జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 31 at 5.28.04 PM

TRINETHRAM NEWS

తిరుపతి నగరంలో కుళ్ళిన చికెన్ విక్రయం

ఫంగర్స్ వచ్చి కుళ్ళిన చికెన్ డీప్ ఫ్రీజ్ లో పెట్టి అమ్మకాలు.. షాప్ను సీజ్ చేసిన అధికారులు…

Trinethram News : తిరుపతి : తిరుపతి నగరంలోని ఒక చికెన్ దుకాణంలో కుళ్లిన చికెన్ విక్రయించడంతో అధికారులు సీజ్ చేశారు. ఇవాళ స్థానిక చికెన్ దుకాణాల్లో కేజీ చికెన్ 220 రూపాయల నుంచి 240 రూపాయల వరకు విక్రయిస్తుండగా ఈ దుకాణంలో మాత్రం కేవలం 150 రూపాయలుకు మాత్రమే విక్రయిస్తుండటంతో మార్కెట్లోని దుకాణ యజమానులు అనుమానం వచ్చి పరిశీలించారు.
చనిపోయిన కోళ్లను కట్ చేసి సుమారు పది రోజులకు పైగా డీప్ ఫ్రిజ్లో పెట్టి కుళ్లిన చికెన్ను విక్రయిస్తున్న విషయాన్ని గమనించారు. వెంటనే మున్సిపల్ హెల్త్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించి, కుళ్ళిన, ఫంగర్స్ వచ్చి దుర్వాసన వస్తున్న చికెన్ ప్రత్యక్షం కావడంతో ఆ చికెన్ దుకాణాన్ని సీజ్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page