త్రినేత్రం న్యూస్ ప్రతినిధి.. రోడ్డు ప్రమాదాల నియంత్రణ,సురక్షిత ప్రయాణం మరియు వాహనదారుల ప్రాణాల రక్షణను ప్రధాన లక్ష్యంగా తీసుకుని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “అరైవ్-అలైవ్” కార్యక్రమంలో భాగంగా,పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 8 ఇంక్లైన్ షిర్కే బస్టాండ్ వద్ద గోదావరిఖని వన్ టౌన్ సీఐ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో,అలాగే మంథని ఎస్‌ఐ రమేష్ ఆధ్వర్యంలో మంథని ఓల్డ్ పెట్రోల్ బంక్ వద్ద విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా రోడ్డు భద్రతా నియమాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు “అరైవ్-అలైవ్” కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రతి వ్యక్తి సురక్షితంగా తన గమ్యస్థానానికి చేరుకోవడమేనని తెలిపారు.ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపడం పూర్తిగా నివారించాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజల సహకారంతోనే ప్రమాదరహిత సమాజాన్ని నిర్మించవచ్చని పేర్కొన్నారు.ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ సురక్షిత మరియు జాగ్రత్త డ్రైవింగ్ పద్ధతులను అనుసరించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి.కార్లు మరియు ఇతర నాలుగు చక్రాల వాహనాలు నడిపేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలి అని స్పష్టం చేశారు.
అలాగే ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ వంటి చెల్లుబాటు అయ్యే ధృవపత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు.ఈ అవగాహన కార్యక్రమాలలో సంబంధిత పోలీస్ అధికారులు, వాహనదారులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


