Road Accident : వికారాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం తండ్రీకొడుకుల మృతి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. వికారాబాద్ సమీపంలోని అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం ఒక నిండు కుటుంబాన్ని చిదిమేసింది జెసిబిని తరలిస్తున్న ట్రక్కు అతివేగంతో దూసుకొచ్చి బైక్ , స్కూటీని బలంగా ఢీకొనడంతో తండ్రీకొడుకులు ప్రాణాలు కోల్పోయారు దారూర్ మండలం కొండాపూర్ కు చెందిన లాలయ్య అనే వ్యక్తి తన ఆరేళ్ల కుమారుడు కృతిక్ తో కలిసి బైక్‌పై వెళ్తుండగా, వెనుక స్కూటీపై భార్య, కుమార్తె వస్తున్నారు.

ఈ క్రమంలో జెసిబి లోడ్‌తో వెళ్తున్న ఒక ట్రక్కు వీరిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరేళ్ల బాలుడు రిత్విక్ అక్కడికక్కడే మృతి చెందగా, తండ్రి లాలయ్య తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. స్కూటీపై ఉన్న తల్లి, కూతురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
సమాచారం అందుకున్న వికారాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వికారాబాద్ పట్టణ సిఐ రఘు కుమార్ మాట్లాడుతూ.. ట్రక్కు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపినట్లు అనుమానిస్తున్నామని, అతనికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించిన అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.
వికారాబాద్ అటవీ ప్రాంతంలో ఉదయం వేళల్లో పొగమంచు దట్టంగా కురుస్తుందని, దీనివల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని తక్కువ వేగంతో ప్రయాణించాలని సూచించారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Father and son die in Vikarabad road accident

You cannot copy content of this page

Scroll to Top