జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ అశ్వారావుపేట.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం, తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు గాను ప్రారంభించిన.

అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ మన కుటుంబాలకు ఒక పియోమైజ్ లోభాగం గా, ఈరోజు భద్రాద్రి కొత్త గూడెం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అశ్వారావుపేట పోలీసుల ఆధ్వర్యంలో మండలంలోని, ఊట్లపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాద నివారణ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్సై యయాతి రాజు మాట్లాడుతూ, హెల్మెట్, సీటు బెల్టు ప్రాముఖ్యత. మద్యం సేవించి డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే అనర్ధాలను గతంలో ఈ ప్రాంతంలో జరిగిన సంఘటనను ఉదహరిస్తూ వివరించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు పాటించవలసిందిగా గ్రామస్తులను కోరినారు.
ఆ తర్వాత గ్రామస్తులందరితో రోడ్డు భద్రత , ప్రతిజ్ఞను చేపించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Arrive Alive Campaign

You cannot copy content of this page