తేదీ : 21/12/2025. గుంటూరు జిల్లా : అమరావతి : (త్రినేత్రం న్యూస్); మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలతో సమావేశమైనారు. వాళ్లకు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిన్నరలో టిడిపి ఎమ్మెల్యేల పనితీరుపై నివేదిక ఇవ్వాలని కోరారు.. అదే విధంగా ఎవరి పనితీరు బాగోలేదో వాళ్లను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తామని తెలిపారు. సచివాలయం అద్దె ఇల్లు లాంటిదని, పార్టీ సొంత ఇల్లు లాంటిదని పేర్కొన్నారు.
అధికారంలో ఉన్నా ,లేకున్నా పార్టీ శాశ్వతమని గుర్తు చేశారు. గ్రామ మండలం, నియోజకవర్గస్థాయిలో పెండింగ్ లో ఉన్నటువంటి పదవులను ఈ నెలాఖరకు భర్తీ చేయాలని సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


