వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం ప్రతినిధి త్రినేత్రం న్యూస్,పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామం నుండి,హైదరాబాద్ రోడ్,దుగ్గపూర్ నుండి,మొదలుకొని,మంచానపల్లి బ్రిడ్జి వరకు కొత్తగా రోడ్డు కేవలం 8 నెలల క్రితం వేయడం జరిగింది, రోడ్ వేసిన కాంట్రాక్ట్ నాణ్యత లేకుండా ,నాసిరకం రోడ్డు వేయడం జరిగింది.అట్టి రోడ్డు గుంతల మయంగా తయారైంది.వాహన దారులు నరకం చూస్తున్నారు. కోట్ల రూపాయలు రోడ్ బాగుచేయటకు అవసరం ఉన్నది,తెలంగాణ ప్రభుత్వం కోట్ల రూపాయలు రోడ్డు కు మంజూరు చేయగా రోడ్ నాణ్యత లేకుండా వేయడానికి కారణం ఏమి?
కోట్ల రూపాయలు ప్రజల డబ్బులు వృధాచేసిన కాంట్రాక్ట్ ,అలాగే రోడ్ రవాణా శాఖ అధికారుల పైన, తాండూర్ ఎమ్మెల్యే భుయ్యని మనోహర్ రెడ్డి మరియు వికారాబాద్ జిల్లా కలెక్టర్ , రోడ్ నాసిరకంగా వేయడానికి కారణమైన వారందరిపైన చట్ట రీత్యా చర్యలు తీసుకొని వెంటనే రోడ్ లో పడిన గుంతలను పూడ్చి బాగు చేయాలని,ఆయా గ్రామాల ప్రజలు,ముఖ్యంగా నరకయాతనకు గురవుతున్న వాహనాల దారులు కోరుతున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


