NH 163 Road Repairs : ఎన్ హెచ్ 163 రహదారికి మరమ్మత్తులు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. అప్పా జంక్షన్ నుండి మన్నెగూడ వరకు రహదారి నిర్మాణానికి ఎదురవుతున్న అడ్డంకులు తొలగించబడ్డాయి. ఈ సందర్భంగా ఎన్ హెచ్ 163 హైవే విస్తరణ సాధన సమితి సభ్యులు హైదరాబాద్‌లోని నివాసంలో పరిగి ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
సమితి సభ్యులు గుంతల కారణంగా రహదారిపై తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు.వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కాంట్రాక్టర్‌తో మాట్లాడి రోడ్డుపై ఉన్న గుంతలలో కాంక్రీట్ వేయించారు. స్వయంగా స్థానిక నాయకులతో కలిసి పనులను దగ్గరుండి పర్యవేక్షించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

NH 163 road repairs

You cannot copy content of this page

Scroll to Top