సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లండి.
కాంగ్రెస్ పార్టీలో పని చేసిన కార్యకర్తలకే పదవులు.
పార్టీ సూచించిన అభ్యర్థి గెలుపు కోసం పని చేయాలి.
ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్.
దేవరకొండ డివిజన్ అక్టోబర్ 06 త్రినేత్రం న్యూస్. దేవరకొండపట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వ్యవసాయ మార్కెట్ యార్డులో దేవరకొండ,నేరేడుగొమ్ము, చందంపేట, డిండి మండలాల ముఖ్య నాయకులతో కలిసిఎం ఎల్ ఏ బాలు నాయక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పని చేయాలి అని, రిజర్వేషన్లపై అపోహాలు నమ్మొద్దు పార్టీ అధిష్టానం నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించుకోవాలి అని సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త, పాత అనే తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలి అని అన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలిఅని పిలుపునిచ్చారు. అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని,కాంగ్రెస్ పార్టీ గెలుపు,బలోపేతం చేసిన వారికి అవకాశాలు ఉంటాయనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు , తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


