CPI : ఆర్థిక అసమానతలు లేని సమసమాజ స్థాపనకై ఎర్రజండా పోరాటం

TRINETHRAM NEWS

పేదరికం ఉన్నంత కాలం ప్రజలకు అండగా సిపిఐ
సిపిఐ డిండి మండల మహాసభలో ఎమ్మెల్సీ,సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం…
డిండి జూన్ 29 త్రినేత్రం న్యూస్. ప్రజా ఉద్యమాలే ఊపిరిగా పోరాటాలే ప్రాణంగా ప్రజలకు అండగా నిలబడి పోరాడుతున్న సిపిఐ రాబోయే రోజుల్లో ఆర్థిక అసమానతలు లేని సమసమాజ స్థాపనకై ఎర్రజండా పట్టుకొని పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్సీ,సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం సిపిఐ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఆదివారం డిండి మండల 15వ,మహాసభ డిండి మండల కేంద్రంలోని ఈజె గార్డెన్ లో జరిగింది.అంతకుముందు పట్టణంలో ని జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. మహాసభ సందర్బంగా ఏర్పాటు చేసిన సిపిఐ జండాను రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి ఎగరవేశారు.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మహాసభలో… ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ…
ఓట్లు సీట్లతో సంబంధం లేకుండా, ప్రజా సమస్యలే అజెండాగా నిత్యం ప్రజల మధ్య నిలబడి పోరాడే పార్టీ సిపిఐ అని, శ్రమకు తగ్గ ఫలితం దక్కాలని దున్నేవాడికి భూమి కావాలని, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించినపార్టీ సిపిఐ అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మతోన్మాద రాజకీయాలతో ప్రజా సమస్యలను విస్మరించి పెట్టుబడిదారుల కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే వాటిని అదుపు చేయకుండా పేదవారి నడ్డి విరిచే విదంగా మళ్ళీ సిలిండర్ ధర పెంచడం అన్యాయమని అన్నారు.పండించిన పంట కు గిట్టుబాటు ధర మరియు, ఎరువులు విత్తనాలు సబ్సిడి మీద ఇవ్వాలని అన్నారు.
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలని ఆయన కోరారు. దేవరకొండ నియోజకవర్గ ప్రధాన సమస్య అయిన పెండింగ్ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేసి నియోజకవర్గాన్ని సాగునీరు అందించాలని కోరారు.నకిలీ విత్తనాలు అరికట్టి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని కోరారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ పార్టీ అభ్యర్థులను గెలిపించుటకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ కాంగ్రెస్ పొత్తును మిత్ర ధర్మంగా ప్రభుత్వ పథకాల్లో సిపిఐ కార్యకర్తలకు అవకాశం కల్పించాలని అన్నారు. స్థానిక సంస్థల్లో సైతం పొత్తులో భాగంగా అవగాహన మేరకు ప్రతినిద్యం ఉన్న గ్రామాల్లో పొత్తులో భాగంగా పోటీ చేయాలని శ్రేణులకు సూచించారు. ఇందిరమ్మ ఇండ్లలో పేదలకు ప్రాధాన్యం కల్పించాలని అన్నారు. ప్రజాపాలనలో ప్రజల కిచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బొడ్డుపల్లి వెంకటరమణ,రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎండి. మైనొద్దీన్,సిపిఐ జిల్లా సమితి సభ్యులు తూం బుచ్చిరెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి శ్రీరామదాసు కనకాచారి, సహాయ కార్యదర్శులు తిప్పర్తి విజేందర్ రెడ్డి, బొల్లె శైలేష్, కార్యవర్గ సభ్యులు బొడ్డుపల్లి రవీంద్ర శర్మ,నూనె వెంకటేశ్వర్లు,కేశవులు, సోమిడి శ్రీనయ్య, ఎలిమినేటి హుస్సేన్, లచ్చయ్య, మహిళా సమాఖ్య డివిజన్ ప్రధాన కార్యదర్శి బొల్లె మంజుల, ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు వల్లమల్ల ఆంజనేయులు, ఏ ఐ వై ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఏనమల్ల నవీన్, ఏ ఐ ఎస్ ఎఫ్ డివిజన్ అధ్యక్షులు సూరిగి వినయ్,శాఖ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Red flag struggle for

You cannot copy content of this page

Scroll to Top