విశాఖ ఉక్కు ప్రేవేటికరణ పై
చంద్రబాబు, పవన్ మౌనం వీడాలీ
పాత్రికేయుల సమావేశంలో
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి
ముప్పాళ్ల నాగేశ్వరరావు
రాజమండ్రి, జూన్ 01: రాష్ట్రం లోని కృష్ణ గోదావరి బేసిన్ లో లభ్యమవుతున్న గ్యాస్ చమురు సహజ వనరుల పై అప్పుల్లో ఉన్న ఆంధ్రాకు వాటా దక్కాలని కోరుతూ జూలై లో రాజమండ్రి లో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు.
ఆదివారం ఉదయం స్థానిక సీపీఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు లక్షల కోట్ల విలువైన సహజ సంపాదనలను కార్పొరేషన్ సంస్థలు దోసుకుపోతున్నాయని ఈ రాష్ట్ర ప్రజలు ఆ దోపిడీ అడ్డుకోవాలని ముప్పాళ్ళ అన్నారు కేజీ బేసిన్లో బొంబాయి కంటే సమరు నిలవలు ఇక్కడే ఉన్నాయని ఆయన అన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద సమురు శాతం ఆంధ్రప్రదేశ్లో ఉందన్నారు ఇక్కడ నుంచి 60 లక్షల కోట్ల విలువైన సమురు నిలవలను కార్పొరేషన్ సంస్థలు తరలించిపోతున్నాయన్నారు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 38.39 బి ప్రకారం సహజ వనరులు ఏ ప్రాంతంలో వెలికి తీసిన ఆ ప్రాంత అభివృద్ధికి 30 శాతం ఖర్చు చేయాలని ఉన్నప్పటికీ ఆచరణలో అమలు కావడం లేదన్నారు రాష్ట్రంలో ఏ సంక్షేమ కార్యక్రమం చేపట్టాలన్న అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి ఈ సమురు వాటాపై దృష్టి పెట్టి మేము చేస్తున్న ఆందోళనకు మద్దతుగా రావాలని ఆయన పిలుపునిచ్చారు
విశాఖ ఉక్కు ప్రైవేటుకరణ ఆపాలని గత నెల రోజులుగా విశాఖపట్నంలో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే ఇప్పటివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు మెదపడం లేదని ఆయన విమర్శించారు అప్పటి ప్రతిపక్షంగా ఉన్నపుడు కూటమి నేతలు విశాఖ స్టీల్ పై పెద్ద రచ్చ చేశారని ఇప్పుడు మౌనం వహిస్తున్న రని ఆయన గుర్తు చేశారు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం సిపిఐ అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని నిరంతరం పోరాటం నిర్వహిస్తుందని ముప్పాళ్ళ తెలిపారు
సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ రేపు జరిగే ఇళ్ల స్థలాల ఉద్యమానికి రాజమండ్రి ప్రజానీకం పెద్ద ఎత్తున తరలిరావాలని మధు పిలుపునిచ్చారు
ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కుండ్రావు రాంబాబు నగర కార్యదర్శి వి కొండలరావు సహాయ కార్యదర్శి సప్ప రమణ నగర కార్యవర్గ సభ్యులు పి లావణ్య పి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


