తేదీ : 16/07/2025. గుంటూరు జిల్లా : అమరావతి:(త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పదవ తరగతి వరకు చదివి , ఇతర రాష్ట్రాల్లో ఇంటర్ చదివిన విద్యార్థులను స్థానికంగా గుర్తించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏడేళ్లు ఒకే చోట చదివితే వాళ్లను ఆ జిల్లా మరియు రాష్ట్రంలో స్థానికులుగా పరిగణిస్తారు అని తెలిపారు.
కానీ కౌన్సిలింగ్ కు ముందు నాలుగేళ్లలో ఏ ఒక్క ఏడాది వేరే చోట చదివినా గాని వాళ్లను స్థానికేతరులుగా గుర్తించేలా జీవో ఉందని పేర్కొన్నారు. దీంతో వందల మంది విద్యార్థులు నష్టపోతున్నారని , న్యాయం చేయండి అని కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


