ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
Alumni Reunite

Alumni Reunite : కూకట్పల్లి జులై 12 (త్రినేత్రం న్యూస్) : కూకట్‌పల్లి బాగ్ అమీర్‌లోని రామకృష్ణ హైస్కూల్ 1997 పదో తరగతి తెలుగు, ఇంగ్లీష్ మీడియం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. సుమారు 29 ఏళ్ల అనంతరం కలుసుకున్న పూర్వ విద్యార్థులు ముందుగా తమ పాఠశాలలో సమావేశమై చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కూకట్‌పల్లిలోని ఏటీసీ బ్యాంక్వెట్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ సార్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ప్రిన్సిపాల్ నర్సా రెడ్డి, జాన్సన్ బాబు, ఉపాధ్యాయులు సత్యనారాయణ, అరుణ, నిర్మల, రాజేశ్వరి, శుక్లాదత్త తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పూర్వ మధుర సంఘటనలను గుర్తుచేసుకుంటూ, పూర్వ విద్యార్థులకు విలువైన సలహాలు, సూచనలు అందించారు. జీవితంలో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ తమ ఆశీర్వాదాలను అందించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు తమ గురువులను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే విద్యార్థి దశలోని అనుభవాలను, ప్రస్తుత జీవన విశేషాలను ఒకరితో ఒకరు పంచుకుని ఆనందంగా గడిపారు. భవిష్యత్తులో సమాజ సేవా కార్యక్రమాలను చేపట్టడంతో పాటు, తమలో ఎవరికైనా ఎలాంటి అవసరం వచ్చినా పరస్పరం సహాయ సహకారాలు అందించుకోవాలని పూర్వ విద్యార్థులు నిర్ణయించుకున్నారు. ఆప్యాయత, అనుబంధం, ఆత్మీయతల నడుమ ఈ సమ్మేళనం విజయవంతంగా ముగిసింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page