కేసీఆర్ చేసిన అభివృధి సంక్షేమ పథకాలే బీ ఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపిస్తాయి
-బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .
దేవరకొండ డివిజన్ డిసెంబర్ 08 త్రినేత్రం న్యూస్. గత పదేళ్ళలో కేసీఆర్ చేసిన అభివృధి సంక్షేమ పథకాలే బీ ఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపిస్తాయి అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.సోమవారం దేవరకొండ మండలం శేరిపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ…..గ్రామాల్లో బిఆర్ఎస్ సానుభూతిపరులను, కేసీఆర్ అభిమానులను ఏకం చెయ్యాలి అని కోరారు.రెండేళ్ల నుండి కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ చేసిన మోసాలు, బిఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమాన్ని గుర్తు చేస్తూ ప్రజల వద్దకు వెళ్లాలి అని ఆయన తెలిపారు.అతి తక్కువ సమయంలో ఎక్కువ వ్యతిరేకత మూటగట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆయన తెలిపారు. కాంగ్రెస్ హామీలను 6 గ్యారన్టీలను గాలికి వదిలేసి అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని , నియోజక వర్గాల్లో అభివృద్ధి అంతంత మాత్రమే అని , స్థానిక ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రమావత్ నర్సింహ, రమావత్ కిస్టు , మాజీ సర్పంచ్ సత్తయ్య, కొండల్, మడెం ఇద్దయ్య, విక్కి,తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


