Ramawat Ravindra Kumar : దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

TRINETHRAM NEWS
Ramawat Ravindra Kumar

దేవరకొండ మాజి శాసన సభ్యులు:– రమావత్ రవీంద్ర కుమార్.

Ramawat Ravindra Kumar : దేవరకొండ డివిజన్ ఏప్రిల్ 04, త్రినేత్రం న్యూస్. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, కేసిఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.

ముమ్మాటికీ ఇది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగిన దాడి అని , ప్రజాస్వామ్యంపై సీఎం చేయించిన దాడి అని ఆయన అన్నారు.పట్టపగలు అధికార మదంతో విర్రవీగుతూ సోయి మరచి వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరు బీహార్ గ్యాంగ్‌ను తలపిస్తోందని ఆయన అన్నారు.ఏకంగా ప్రజా ప్రతినిధుల క్యాంపు కార్యాలయాల పైనే ముప్పేట దాడులు చేస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా లేనట్లా? అని ఆయన ఘాటుగా విమర్శలు చేసారు.

కాంగ్రెస్ పాలనలో ప్రజా ప్రతినిధులపై దాడులు, ప్రజా సంఘాలపై దాడులు, మీడియా పై దాడులు.. నిత్యకృత్యం కావడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు.శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి ప్రైవేట్ సైన్యంలా మారిపోయారా? ఎందుకు అడ్డుకోవడం లేదు? అని ఆయన అన్నారు.ఒకవైపు “హేట్ స్పీచ్ బిల్” పేరుతో ప్రజలు, ప్రతిపక్షాల నోళ్లు మూయిస్తూ… మరోవైపు గూండాలతో దాడులు చేయించడమేనా మీ ప్రజా పాలన? అని ఆయన ప్రశ్నించారు.ఇందిరమ్మ రాజ్యం అని చెబుతూ… గూండా రాజ్యం అమలు చేస్తారా ఆయన అన్నారు.
సీఎం, మంత్రులు ఇతర రాష్ట్రాల్లో పొలిటికల్ టూర్లు చేస్తూ… పాలనను గాలికి వదిలేసారా అని అన్నారు.ముఖ్యమంత్రి, మంత్రులు ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఉంటే… ఇక్కడ పాలనను ఎవరు చూస్తారు,ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని డబ్బా కొట్టి ఇప్పుడు, ఉన్న ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఎమర్జెన్సీ పాలనను తలపిస్తున్నారు అని ఆయన అన్నారు.మీ అణచివేతలకు, మీ నిర్బంధాలకు, మీ దాడులకు బిఆర్ఎస్ పార్టీ అదరదు బెదరదు.

ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటం, ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉంటం అని ఆయన అన్నారు.ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై దాడులు జరిపిన గూండాలను గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని రాష్ట్ర తెలంగాణ డీజీపీ కి డిమాండ్ చేశారు.ఇలాంటి దాడులు ఆపకపోతే… ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలే వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని ఆయన హెచ్చరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top