జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Ramawat Ravindra Kumar

గ్రామీణ ప్రాంత ప్రజలకు నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్యం శిబిరం అభినందనీయం.

రమావత్ రవీంద్ర కుమార్. -మాజి శాసన సభ్యులు .

Ramawat Ravindra Kumar : దేవరకొండ డివిజన్ జూన్ 05, త్రినేత్రం న్యూస్. పేద ప్రజల ఆరోగ్యం కోసం నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలు సమాజ అభివృద్ధికి ఎంతో దోహదపడతాయి -ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి.ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ను దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ సందర్శించారు.

దేవరకొండ మండలం కొండభీమనపల్లి గ్రామంలో మునుకుంట్ల వెంకట్ రెడ్డి సౌజన్యంతో నిర్వహిస్తున్న ఉచిత మెగా కంటి వైద్య శిబిరం శుక్రవారం ఆయన సందర్శించి కళ్లజోళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. సమాజ సేవా దృక్పథంతో ఈ క్యాంపును ఏర్పాటు చేసిన శ్రీ మునుకుంట్ల వెంకట్ రెడ్డి ని ప్రత్యేకంగా అభినందించారు.

ప్రజల ఆరోగ్యం కోసం నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలు సమాజ అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కంటి వ్యాధుల నివారణకు, ముందస్తు గుర్తింపుకు ఇటువంటి శిబిరాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు.అనంతరం క్యాంపు నిర్వాహకులు ముఖ్య ఆయన ను శాలువాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మునికుంట్ల వెంకట్ రెడ్డి,స్థానిక ఉప సర్పంచ్ కడారి సైదులు, బొడ్డుపల్లి కృష్ణ, వడత్య బాలు, అప్పనాల తిరుమల, గుండాలవెంకట్,మల్లేష్ పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page