జూన్ 26, 2026
TRINETHRAM NEWS
black gas attack

Black Gas Attack : దేవరకొండ డివిజన్ జూన్ 05, త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం వ్యాప్తంగా బ్లాక్ గ్యాస్ దందా జోరుగా నడుస్తుందని చెప్పకనే చెప్పవచ్చు.
ఇటీవల కాలంలో ఏర్పడ్డ గ్యాస్ కొరత తో ఇదే అదునుగా భావించిన బ్లాక్ మాఫియా గ్యాస్ ధర రెండింతలుగా పెంచి అమ్ముతున్నారు అని ప్రజలు వాపోతున్నారు .అదేవిధంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు కూడా మార్కెట్లో సరిపడా అందుబాటులో లేకపోవడం వల్ల హోటల్లు మొత్తం మూతపడే పరిస్థితి వచ్చిందని హోటల్ నిర్వాహకులు వాపోతున్నారు అదేవిధంగా పేద ప్రజలు కుటుంబాల నుండి గ్యాస్ బుక్ చేసుకోగానే ఓటిపిలు రావడంతో తీసుకుని వాళ్లకు గ్యాస్ సిలిండర్ ఇవ్వకుండా స్టాక్ అందుబాటులో లేదంటూ దబాయిస్తూ వారు గ్యాస్ ను బ్లాక్ లో అమ్ముకుంటూ వేరేవాళ్లకు ఇస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు ఇప్పటికైనా సంబంధిత సివిల్ సప్లై అధికారులు చొరువతో దేవరకొండలో జరిగే బ్లాక్ మాఫియాను అరికట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page