Rahul Gandhi : డి సి సి అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి రాహుల్ గాంధీ

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. వికారాబాద్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జిల్లాలో పర్యటించనున్నారు. అనంతగిరి హరిత రిసార్ట్‌లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులు రేపటితో ముగియనున్నాయి.

ఈ ముగింపు కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరై, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా ఇరు రాష్ట్రాల ముఖ్య నేతలు పాల్గొంటారు. రాహుల్ రాక నేపథ్యంలో పోలీసులు పట్టణంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Rahul Gandhi to attend DCC presidents' training

You cannot copy content of this page

Scroll to Top