అక్రమంగా అరెస్టు చేసి నవాబ్ పేట్ పోలీస్ స్టేషన్ కు తరలించిన రీజనల్ రింగ్ రోడ్ బాధిత రైతులను పరామర్శించిన వికారాబాద్ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్. అక్రమంగా అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ ని (ఫోన్లో) కోరారు. మాజీ మంత్రివర్యులు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తో ఫోన్ లో మాడ్లడించి రైతులకు భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రివర్యులు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని కలవడానికి వెళ్తున్న రైతులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ కాంగ్రెస్ పాలనలో ప్రజలకు వారి ప్రజాప్రతినిధులను కలిసి, తమ బాధలు వివరించుకునే స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది. రైతుల నిర్బంధాలతో భూసేకరణ చేయడం తగదు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని తప్పులతో జీవోలు జారీ చేసి, రైతులను అక్రమంగా అరెస్టు చేస్తూ భయభ్రాంతులకు గురి చేయడమేనా ఇందిరమ్మ రాజ్యం అంటే?
రీజినల్ రింగ్ రోడ్ భూసేకరణ అంశంలో రేవంత్ రెడ్డి సొంత అజెండతో ముందుకు వెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒరిజినల్ అలైన్‌మెంట్ ప్రకారం మరియు రైతుల పూర్తి అంగీకారంతో మాత్రమే భూ సేకరణ జరపాలి. రీజినల్ రింగ్ రోడ్ విషయంలో రైతుల హక్కులను కాలరాస్తూ ఇష్టానుసారంగా భూములు లాక్కుంటామంటే సహించేది లేదు. రైతుల చేతులకు బేడీలు వేయడం, ఇది అన్యాయమని రైతుల పక్షాన నిలబడి మద్దతు తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులను సైతం అరెస్టు చేయడం ఈ ప్రభుత్వానికి ఆనవాయితీగా మారింది.
ప్రజల పట్ల ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్న ఈ రాక్షస ప్రభుత్వానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం నేర్పిస్తారు. ఈ కార్యక్రమంల తెలంగాణ విద్యాశాఖ మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్, నాయకులు భరత్ రెడ్డి, విజయ్ లతో పాటు శ్రేణులు మరియు బి ఆర్ ఎస్ నాయకులు, చించల్పేట్, చిట్టి గిద్ద గ్రామ రైతులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


