ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీ కోసం

TRINETHRAM NEWS

  లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను నిర్ణీత కాలవ్యవధిలో త్వరిత గతిన పరిష్కరించాలి.

పరిపాలన అధికారిణి ఎం. సుజాత.
త్రినేత్రం న్యూస్ : రాజమహేంద్రవరం : సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం లో నిర్వహించిన “పి జి ఆర్ ఎస్ – మీ కోసం” వేదిక లో వచ్చిన అర్జీలను కార్యాలయ పరిపాలన అధికారిణి ఎం. సుజాత డివిజనల్ స్థాయి అధికారులతో కలసి స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “పిజిఆర్ఎస్ – మీ కోసం”  ద్వారా ప్రజల నుంచి 2 అర్జీలను స్వీకరించడం జరిగిందన్నారు. ప్రతి అర్జీని నిర్నీత కాల వ్యవధిలో పరిష్కరించి దరఖాస్తుదానికి న్యాయం చేయాలని అధికారులకు సూచించారు.

ఈరోజు అర్జీలు.

రాజానగరం మండలం జవాన్ చెరువుకు చెందిన కె. నరసింహమూర్తి అనే వ్యక్తి తన స్థలాన్ని రీ సర్వే చేసి అప్పగించ వలసినదిగా దరఖాస్తు నందు పేర్కొన్నారు.

రాజమహేంద్రవరం, నారాయణపురానికి చెందిన వి. రవిశంకర్ శ్రీనివాస్ అనే వ్యక్తి తనకు నష్టపరిహారం ఇప్పించ వలసినదిగా దరఖాస్తు చేసుకొని ఉన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Public Problem Solving Platform

You cannot copy content of this page

Scroll to Top