చలివేంద్రం ప్రారంభించిన మాజీ ఎంపీ మార్గాని భరత్
వేసవిలో పిల్లలను బయటకు వెళ్ళనివ్వకండి
తలిదండ్రులకు భరత్ సూచన
త్రినేత్రం న్యూస్ : రాజమండ్రి,ఏప్రిల్ 28: వైసీపీ రాజమండ్రి నగర యువజన విభాగం అధ్యక్షుడు బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో 6 వ వార్డు యువజన విభాగం అధ్యక్షుడు గుడివాడ అప్పారావు సారధ్యంలో బైపాస్ రోడ్డు డి.ఎం.హెచ్.స్కూలు ఎదురుగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు.అనంతరం మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ ఆరో వార్డు యువజన విభాగంసభ్యులంతా ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.బిల్డర్ చిన్న ఎప్పుడూ ఏదో ఒక మంచి కార్యక్రమం చేస్తూ ఉంటారని అలాగే ఈ ఏడాది కూడా ఇక్కడ బాటసారులకు ఉపయోగపడే విధంగా చలివేంద్రం ఏర్పాటు చేశారని కొనియాడారు.
వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున తలిదండ్రులు తమ పిల్లలను బయటకు పంపించవద్దని సూచించారు.మే నెలలో మరింత అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున పిల్లలు బయటకు వెళ్ళాల్సివస్తే టోపీ,ఇతర రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రజా హితం కోసం తమ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని,కోవిడ్ లో కూడా తమ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజల రక్షణకు,వారిని ఆదుకునేందుకు అనేక చర్యలు చేపట్టారని ఈ సందర్భంగా మాజీ ఎంపీ మార్గాని భరత్ గుర్తు చేశారు.భవిష్యత్తులో కూడా తమ పార్టీ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతుందని ఆయన అన్నారు.కార్యక్రమంలో గాండ్ల,తెలకుల కార్పొరేషన్ మాజీ చైర్ పర్సన్ సంకిస భవాని ప్రియ, ట్రేడ్ నాయకుడు వాసంశెట్టి గంగాధరరావు, మున్సిపల్ విభాగం మజ్జి అప్పారావు, ట్రేడ్ యూనియన్ నాయకుడు నరవ గోపాలకృష్ణ,కడియాల శ్రీనివాస్ ,సప్పా ఆదినారాయణ,గౌస్,నగరబోయిన శ్రీనివాస్, గుడివాడ నాగేశ్వరరావు,వగ్గు వెంకటేశ్వరరావు,రేగల శ్రీధర్,పి.చంద్రకుమార్, గాది గౌరీ శంకర్,నందం స్వామి,బూరాడ కనక లింగేశ్వరరావు,శంకు సత్తిరాజు,బి. గౌరీ శంకర్,రొక్క వంశీ,దువ్వాడ గౌరీ శంకర్,గుడివాడ లక్ష్మి, అనంతలక్ష్మి, వరలక్ష్మి, గుడివాడ భవానీ,మార్గాని సుశీల,గుమ్మల వీరలక్ష్మి,నగరబోయిన లలిత తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


