వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజా సమస్యలపై వచ్చిన అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన తెలిపారు.
ప్రజావాణిలో119 దరఖాస్తులు రాగా రెవిన్యూ సమస్యలతో పాటు హౌసింగ్, డిపిఓ, ఇర్రిగేషన్, సర్వే ల్యాండ్ రికార్డు, పశు సంవర్దక, డీఆర్ డిఓ పెన్షన్, పోలీస్ శాఖలకు చెందిన అర్జీలు ఉన్నాయి. ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, ఆర్డీఓ వాసుచంద్ర, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


