తేదీ : 16/04/2025. గుంటూరు జిల్లా: అమరావతి: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 2024-2025 విద్యా సంవత్సరానికి ఏప్రిల్ ఒకటవ తేదీన పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. ఇక జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ఈ నెల మూడవ తేదీ నుండి ప్రారంభమవ్వగా తొమ్మిదవ తేదీతో ముగియడం జరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో మూల్యాంకనం చేపట్టారు. ప్రస్తుతం మార్కులను ఆన్లైన్లో ఎంటర్ చేస్తున్నారు. ఇది కూడా దాదాపు తుది దశకు చేరుకుంది. దీంతో వారం లోపే పదవ తరగతి పరీక్ష ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఒకవేళ అన్ని సవ్యంగా కుదిరితే ఈనెల 22వ తేదీన టెన్త్ ఫలితాలు విడుదల చేయాలని విద్యాశాఖ భావిస్తుంది. ఎప్పుడెప్పుడు అని ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న విద్యార్థుల నిరీక్షలకు మరో వారంలో తెర పడనుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


