ఆగస్ట్ 31, 2026
TRINETHRAM NEWS
Public Auction

–గ్రామ సర్పంచ్ రఫియా బశీర్.

Public Auction : డిండి (గుండ్ల పల్లి) ఆగస్టు 10, త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని దాసరి నెమలిపూర్ గ్రామంలోకి అనుమానాస్పదంగా ప్రవేశించి, మూడేళ్లుగా ఆశ్రయం పొందుతున్న ఒక పాడి గేదెను ఈ నెల 20వ తేదీన బహిరంగ వేలం వేయాలని గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా నిర్ణయించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు సంవత్సరాల క్రితం ఒక పాడి గేదె తప్పిపోయి దాసరి నెమలిపూర్ గ్రామంలోకి ప్రవేశించింది. ఆ గేదెపై జాలిపడిన స్థానిక రైతు కొత్తగొల్ల జంగయ్య గత మూడేళ్లుగా దానికి మేత వేస్తూ, అన్ని తానై ఆలనా పాలనా చూసుకుంటున్నారు.

–యజమానిగా చెప్పుకున్న వ్యక్తి వెనకడుగు:

ఇదిలా ఉండగా, మొన్నటి రోజున దేవరకొండ పట్టణానికి చెందిన యాదయ్య అనే రైతు గ్రామానికి వచ్చి, ఆ గేదె తనదేనని నమ్మబలికాడు. అయితే, గేదె గుర్తులపై గ్రామస్తులు మరియు పెద్దలు అడిగిన ప్రశ్నలకు అతను సరైన సమాధానాలు చెప్పలేకపోయాడు. సమాధానాలు అనుమానాస్పదంగా ఉండటంతో గ్రామస్తులు అతడిని నిలదీసి వెనక్కి పంపించివేశారు.

–గ్రామాభివృద్ధి నిధికి వేలం డబ్బులు:
గేదె తప్పివచ్చి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఇప్పటివరకు అసలు యజమాని ఎవరూ రాకపోవడంతో, ఈ నెల అన్ 20వ తేదీన (గురువారం) గ్రామ పంచాయతీ లేదా గ్రామ చావడి వద్ద అందరి సమక్షంలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ రఫియాబషీర్ మరియు గ్రామపెద్దలు వెల్లడించారు. వేలం ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని గత మూడేళ్లుగా గేదెను సాకిన రైతుకు పోషణ ఖర్చుల కింద అందించి, మిగిలిన మొత్తాన్ని గ్రామాభివృద్ధి లేదా స్థానిక ఆలయ నిధికి జమ చేయనున్నట్లు తెలిపారు. ఈ గేదెపై అసలైన యజమానులు ఎవరైనా ఉంటే సరైన ఆధారాలతో వేలం సమయానికి ముందే గ్రామ పాలకవర్గం సభ్యులను మరియు పెద్దలను సంప్రదించాలని కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page