త్రినేత్రం న్యూస్,జనవరి 31, రాజమండ్రి రూరల్ నియోజవర్గం ధవలేశ్వరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు వై. యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారంపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి దుష్ప్రచారాలకు నిరసనగా ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తిరుమల ప్రసాదానికి చంద్రబాబు నాయుడు చేసిన ఘోర అపచారమని,ముఖ్యమంత్రి పదవి అడ్డుపెట్టుకుని చంద్రబాబు నాయుడు తప్పులు చేస్తున్నాడని,పవిత్ర తిరుమల తిరుపతి ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారని,చంద్రబాబు నాయుడు కుట్రల కారణంగా కలిగిన అపచారాల వల్ల రాష్ట్ర ప్రజలకు ఎటువంటి కష్టం- నష్టం కలుగకుండా ఈరోజున పాప పరిహారణ పూజలు నిర్వహించామని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక భారీ కుట్ర పూర్తిగా బద్దలైందని అబద్ధాల పునాదులపై విష ప్రచారంతో చిచ్చును రాజేసి రాజకీయ లబ్ది పొందాలని చంద్రబాబు రచించిన కుట్ర చివరికి కూలిపోయిందని నిజం గెలిచి అబద్ధం ఓడిందని,తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వేదికగా చేసుకుని స్వామి వారి ప్రసాదాన్ని ఆయుధంగా మార్చి చంద్రబాబు నాయుడు చేసిన నాటకం పూర్తిగా భగ్నమైందని ఇంత నీచమైన రాజకీయాన్ని ఇంతవరకు రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ చూడలేదని రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు ఇలాంటి దుర్మార్గం కొట్రను తిరుమల వెంకన్న స్వామి వారే కూల్చేశాడు 2024 సెప్టెంబర్ 18న కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు చేసిన ప్రకటన ఒక మహాపాతకం తిరుమలలో జంతువులు కొవ్వు కలిసింది అంటూ ఆధారాలు లేకుండా మాట్లాడడమే ఈ కుట్రక పునాది అని అన్నారు, రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు ఎంతటి నీచానికన్నా దిగజారతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు నక్కా రాజబాబు,గిరిజాల బాబు,నక్కా నగేష్, పార్టీ నాయకులు మింది నాగేంద్ర, అంగాడ సత్యప్రియ,దేవులపల్లి సరిత, రుక్యా సయ్యద్,పసుపులేటి దేవి, ధనమ్మ, కనకమహాలక్ష్మి దేవమాత,సాధనాల శివ,గోలి దేవా,ఎన్ వి శేఖర్,ఆచంట కళ్యాణ్, బొప్పన సుబ్బారావు, రాజమౌళి,సత్యం రమణ,చొల్లంగి సచ్చగిరి,గూటం రాజు దాసరి ధర్మ, బర్రి కామేష్,పెనుమాక సునీల్ కొల్లి వెంకటరత్నం,పుచ్చ గోవింద్ రెడ్డి, మీగడ గంగాధర్, మద్దా దుర్గారావు,ముద్దాల అను,కల్లూరి చైతు,,ముత్యాల పోసి కుమార్,వై.
యస్ కుమార్,ఏనుముల త్యాగరాజు, కోటిపల్లి రవి,చింతపర్తి రాంబాబు,,బోడేటి శివాజీ, షట్టర్ భాష,,మస్తాన్ భేగ్, ప్రసన్నకుమార్,పరిమళ బాబీ,తాతపూడి సత్యనారాయణ,ఉండ్రాజవరపు సూర్య,,ఏలూరి కుమార్,పట్టా ఉత్తేజ్,కొల్లి నాని, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


