
Prizes Given Winners : కృష్ణాజిల్లా : త్రినేత్రం న్యూస్ : జూన్ 06; జిల్లా కేంద్రమైన మచిలీపట్నం సమీపంలో ఉన్నటువంటి జిల్లా గ్రంధాలయ సంస్థ ఆధ్వర్యంలో గన్నవరం నియోజకవర్గం, బాపులపాడు మండలం, కానుమోలు శాఖ గ్రంధాలయం నందు గత నలభై రోజులుగా వేసవి శిక్షణ తరగతులు నిర్వహించారు.
అయితే ఈ ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను గ్రంధాలయాలు వైపు ఆకర్షితులు చేయుటకుగాను శిక్షణ కాలంలో నిర్వహించిన యోగ , క్యారమ్స్, కబడ్డీ ఏడు పెంకులు ఆట కంప్యూటర్ ప్రోగ్రామ్స్ చదరంగం డ్రాయింగ్, మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు ముప్పై ఐదు మంది విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది .
ముఖ్యఅతిథిగా ఆ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, మరియు ఏపీ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికిపాటి శివశంకర్ పాల్గొన్నారు. వాళ్లు మాట్లాడుతూ విద్యార్థులు వారంలో ఒక్కరోజున గ్రంథాలయంసందర్శించాలని వేసవి శిక్షణ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన సిబ్బందిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు చిన్నం శ్రీదేవి మాట్లాడుతూ గ్రంథాలయంలో ఉన్న కంప్యూటర్ లు ఉపయోగించుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని చరవాణిని వీడాలని సెలవులలో గ్రంథాలయాలని తప్పక ఉపయోగించుకోవాలని కోరారు. రాణా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు సుంకర సాంబశివ,రాయల్ ,గ్రామ బీసీ సెల్అధ్యక్షులు రెడ్డి శ్రీనివాసరావు, గ్రంథాలయ పాలకులు షేక్ రహీం తదితరులు పాల్గొన్నారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe