జూన్ 30, 2026
TRINETHRAM NEWS
Summer Camp End

Summer Camp End : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూన్ 06; నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం, చనుబండ గ్రామంలో వేసవి విజ్ఞాన శిబిరం నియోజక వర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాస రావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. గ్రంధాలయాలను ఆధునిక దేవాలయాలని , అదేవిధంగా విజ్ఞాన బాండా గారాలని గుర్తు చేశారు. ముందుగా అతిథులు,గ్రంథాలయాధికారి కేకు కోసి పిల్లలకు పంచారు. శిబిరం లో పాల్గొన్న విద్యార్థినీ, విద్యార్థులకు బిస్కెట్లు పంచడం జరిగింది.

ఈ వేసవి విజ్ఞాన శిబిరం లో పాల్గొన్న ప్రతి స్టూడెంట్ కు బహుమతి మరియు ప్రశంసా పత్రం అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలెడ్జే పవర్ అని, పుస్తక పఠనం ద్వారా నాలెడ్జ్ పెరుగుతుందనీ, దానికి గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలని మోరంపూడి స్టూడెంట్స్ కు సూచించారు.
అతిథులు కందుల కృష్ణ, చీదిరాల మారేశ్వర రావు, నక్కా రాము, బజ్జూరి గోపి, గ్రంథాలయాల ఉపయోగాలను విద్యార్థినీ, విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి శ్రీకాంత్, సిబ్బంది త్రివేణి, షేక్ రియాజ్, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page