జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 09 at 13.53.21

TRINETHRAM NEWS

ఈటానగర్‌:మార్చి 09
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో నిర్మించిన డబుల్ లేన్ ఆల్ వెదర్ సెలా టన్నెల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఈటానగర్‌ నుంచి వర్చు వల్‌గా నేడు ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు.

ఈ సంద‌ర్భంగా మోదీ మాట్లాడుతూ… ఈశాన్య రాష్ట్రాల్లో మోదీ గ్యారంటీ ఫలితాలు కనిపిస్తున్నాయ‌ న్నారు. బీజేపీ ఘన విజయం సాధించనుందని దీంతో అర్థం అవుతోంద‌ని చెప్పారు.. తాను ఎన్నికల్లో విజయం కోసం పనిచేయ న‌ని, ప్రజల కోసమే పని చేస్తాన‌ని అన్నారు..

70ఏళ్ల‌లో చేయ‌ని అభి వృద్ధిని ప‌దేళ్ల‌లో చేశా.
యూపీఏ ప్రభుత్వ పాలన లో అభివృద్ధి కుంటుపడిం ద‌ని ధ్వ‌జ‌మెత్తారు.. నార్త్‌ ఈస్ట్‌ రాష్ట్రాల్లో రూ.55వేల కోట్ల‌ పనులు ప్రారంభించడం ఆనందంగా ఉంద‌ని చెప్పారు..

70ఏళ్ల యూపీఏ పాలనలో చేయని అభివృద్ధి ని తాను పదేళ్లలోనే చేసి చూపించా నని ప్ర‌ధాని అన్నారు…అష్ట లక్ష్మీ పథకం ద్వారా ఈశా న్య రాష్ట్రాలను అభివృద్ధి చేయడమే త‌న‌ లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు…..

You cannot copy content of this page