WhatsApp Image 2024 03 09 at 14.00.15
Trinethram News : హైదరాబాద్:మార్చి 09
రాజకీయాల్లో పార్టీలు మారడం సర్వసాధారణం. అయితే గెలిచిన పార్టీలోకి దూకడానికి నాయకులు ముందు వరుసలో ఉంటా రు. విలువల కంటే కూడా మనం అధికారంలో ఉన్నా మా? లేదా అని చూసుకునే వారే ప్రస్తుత కాలంలో ఎక్కువగా అగుపిస్తుం టారు.
ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తరువాత కాంగ్రెస్‌లోకి వలసల ప్రవాహం పెరిగి పోయింది.
లోకల్ నేతలు అడ్డుకట్ట వేసిన ఆగకుండా ఏదో ఓ సాయంతో పార్టీలో జాయిన్ అవుతున్నారు. మాజీ మంత్రుల నుండి మొదలు కుని సర్పంచ్‌ల వరకు అందరూ కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్నారు.
