Pressured to Commit Adultery : వ్యభిచారం చేయమని ఒత్తిడి.. నిరాకరించిందని ప్రియుడు చాకుతో పొడిచి హత్య

TRINETHRAM NEWS

Trinethram News : అంబేద్కర్ కోనసీమ జిల్లా – రాజోలు. రాజోలు మండలం బి.సావరం గ్రామం సిద్ధార్థనగర్ లో ఓ వివాహిత యువతిని ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఓలేటి పుష్ప (22) గతంలో వివాహం చేసుకుని విడాకులు తీసుకుంది. అనంతరం షేక్ షమ్మ (22) అనే యువకుడితో కలిసి గత ఆరు మాసాలుగా బి.సావరం గ్రామంలో అద్దె ఇంట్లో సహజీవనం చేస్తోంది.

షమ్మ గత కొన్ని రోజులుగా మద్యంతాగి పుష్పను వ్యభిచారం చేయాలని గొడవపడుతూ ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో “నా వెంట రావాలి” అంటూ మరోసారి అదే విషయంపై వాదన చోటుచేసుకుంది. పుష్ప నిరాకరించడంతో కోపంతో షేక్ షమ్మ ఆమెను చాకుతో ఎడమ రొమ్ము మీద, కాలిపై పొడిచి హత్య చేశాడు.

దీనితో పాటు పుష్పను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆమె తల్లి గంగ, సోదరుడిని కూడా గాయపరిచి పరారయ్యాడు. తీవ్రంగా రక్తస్రావం అయిన పుష్ప ఘటనాస్థలంలోనే మృతి చెందింది.

సమాచారం అందుకున్న రాజోలు సీఐ నరేష్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. నిందితుడు షేక్ షమ్మ కోసం 2 టీమ్ లతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pressured to commit adultery

You cannot copy content of this page

Scroll to Top