Press Club Elections : ప్రెస్ క్లబ్ ఎన్నికల వెంటనే నిర్వహించాలి

TRINETHRAM NEWS

జేఏసీ సభ్యుల ఆధ్వర్యంలో దీక్షలు ప్రారంభం

త్రినేత్రం న్యూస్, రాజమహేంద్రవరం, జనవరి 08: గత ఏడు సంవత్సరాల కాలంగా ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించకుండా కొంత మంది అవలంబిస్తున్న నిరంకుశ వైఖరి వ్యతిరేకంగా, ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని, అర్హులైన జర్నలిస్టులు అందరికీ సభ్యత్వ నమోదు ప్రభుత్వ యంత్రాంగం చేపట్టాలని, ఏడేళ్ల కాలంగా ప్రెస్ క్లబ్ ఆర్థిక వ్యవహారాలపై విచారణ జరపాలని కోరుతూ జేఏసీ సభ్యులు రీలే నిరాహార దీక్షలు ప్రారంభించారు.

గురువారం గణేష్ చౌక్ లో ఉన్న రాజమండ్రి ప్రెస్ క్లబ్ వద్ద స్థానిక 32 వ వార్డు కార్పొరేటర్ ద్వారా పార్వతి సుందరి దీక్షలు చేపట్టిన సభ్యులకు పూలదండలు వేసి దీక్షలు ప్రారంభించారు. తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గుడా మాజీ చైర్మన్,
గన్ని కృష్ణ దీక్ష శిబిరం వద్ద కు వచ్చి మద్దతు తెలిపారు. బీసీ సంక్షేమ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు లబ్ధిక మల్లేష్ దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ ఎన్నికలు త్వరలో నిర్వహించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు దీక్షా శిబిరం వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. మాజీ ప్రెస్ క్లబ్ కార్యదర్శి నామాబత్తుల రాంబాబు సందర్శించి మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ కార్యవర్గం నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండించారు. ప్రెస్ క్లబ్ ఎన్నికలు న్యాయబద్ధంగా నిర్వహించాలని, ఏడేళ్లుగా ప్రెస్ క్లబ్ కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపై విచారణ జరపాలని కోరారు.

అర్హులైన విలేకరులకు సభ్యత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. మొదటి రోజు దీక్షలో జేఏసీ చైర్మన్ చేబోలు రాజు, కన్వీనర్ డి.ఏ. లింకన్, వైస్ చైర్మన్ ఎం. సోమరాజు, వి. రవికుమార్, డి. విశాలాక్షి, పి. రామమూర్తి, పి. వెంకటేష్,కూడెల్లి రత్నం కిషోర్, రాఘవేంద్ర, ఎన్. సాయిరాం తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ మెంబర్ రాఘవేంద్రరావు, రమేష్, గిరీష్, సాయిరాం,పి. మహేష్, నాగరాజు, యాకోబు, మై టీవీ సాయి, వీరబాబు, నజీర్, యార్లగడ్డ నరేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Press Club elections

You cannot copy content of this page

Scroll to Top