Trinethram News : ఒలింపిక్స్-2036 క్రీడల నిర్వహణకు భారత్ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. గత పదేళ్లలో అంతర్జాతీయ క్రీడలకు భారత్ వేదికగా నిలిచిందని చెప్పారు.
వారణాసిలో 72వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్‌షిప్ పోటీలను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు.
గత దశాబ్ద కాలంలో భారత్‌లో 20కిపైగా అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించామని ప్రధాని గుర్తుచేశారు. అండర్-17 ఫిపా వరల్డ్‌కప్, హాకీ వరల్డ్ కప్, చెస్ టోర్నమెంట్ లాంటి అంతర్జాతీయ ఈవెంట్లకు భారత్ ఆతిథ్యం ఇచ్చిందన్నారు. 2030లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ కూడా భారత్‌లోనే జరగనున్నాయని తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


