MLA Satyananda Rao : ప్రజలు సమస్యల నుండి విముక్తి కోసమే ప్రజాదర్బార్

TRINETHRAM NEWS

ప్రజాదర్బార్ వినతులు స్వీకరించిన,కొత్తపేట ఎమ్మెల్యే…

త్రినేత్రం న్యూస్: సమస్యల నుండి ప్రజలకు విముక్తి కలిగించాలనే ఉద్దేశంతో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు.రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద ఈ రోజు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజలకు నుంచి వినతులను ఎమ్మెల్యే స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 62 వినతులు వచ్చాయని ప్రజల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేందుకు ప్రతి వారం నియోజకవర్గ ప్రజాప్రతినిధుల ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

ఈ వినతులను సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే సత్యానందరావు అన్నారు.ఈ కార్యక్రమంలో గుత్తుల రాంబాబు,ముత్యాల బాబ్జి, కాస సాగర్, పెచ్చేటి చిన్నారావు,సాధనల శ్రీను మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Praja Darbar is being

You cannot copy content of this page

Scroll to Top